ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rangareddy : జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ముసుగు దొంగలు..

ABN, Publish Date - Mar 19 , 2025 | 06:33 PM

Rangareddy : ఈ జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు. ఊళ్లకు ఊళ్లు కొల్లగొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎప్పుడు ఏ ఇంట్లో చోరీ జరుగుతుందో తెలియక గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Rangareddy District : రంగారెడ్డి జిల్లాలో వరుస చోరీలతో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. చేవెళ్ళ మండలం చింగప్పగూడలో తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా ముగ్గురు దొంగలు మూడు గ్రామాల్లో హల్‌చల్‌ చేశారు. సింగప్పగూడ, రామన్నగూడ, న్యాలట గ్రామాల్లోని ఇళ్లల్లో చోరీకి పాల్పడినట్లుగా గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. సింగప్పగూడలో శేఖర్‌రెడ్డి తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు తాళం పగులగొట్టి రూ.8 వేల నగదు, ఓ బైక్‌ ఎత్తుకెళ్లారు. ఓ ఇంటి ఎదుట పార్క్‌ చేసిన బైక్‌తో పారిపోతుండగా రామన్నగూడ వద్ద బైక్‌లో పెట్రోల్‌ అయిపోవడంతో ద్విచక్రవాహనం అక్కడే వదిలేసి పారిపాయారు. మూడు గ్రామాల్లోని సీసీ కెమెరాలో వారి కదలికలను గ్రామస్థులు గుర్తించారు.

Updated Date - Mar 19 , 2025 | 06:40 PM