Leopard Spotted: హైదరాబాద్ గోల్కొండలో చిరుత పులి కలకలం
ABN, Publish Date - Jul 28 , 2025 | 07:57 PM
Leopard Spotted: హైదరాబాద్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున గోల్కొండ ఇబ్రహీం బాగ్ మిలటరీ ప్రాంతంలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
హైదరాబాద్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున గోల్కొండ ఇబ్రహీం బాగ్ మిలటరీ ప్రాంతంలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తారామతి వెనుకవైపు ఉన్న మూసీ వైపు చిరుత వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు అటవీ అధికారులకు తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు. ఇక, చిరుత పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
ఇవి కూడా చూడండి
పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌కు సీఎం చంద్రబాబు
తెలంగాణ రాజకీయాల్లో కులగణన కుంపటి!
Updated Date - Jul 28 , 2025 | 07:57 PM