LVM3-M5: నింగిలోకి ‘బాహుబలి రాకెట్’..
ABN, Publish Date - Nov 02 , 2025 | 05:49 PM
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ‘బాహుబలి రాకెట్’ను ప్రయోగించింది. శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన LVM3-M5 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తోంది. ఈ రాకెట్ CMS-3 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్తోంది.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ‘బాహుబలి రాకెట్’ను ప్రయోగించింది. శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన LVM3-M5 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తోంది. ఈ రాకెట్ CMS-3 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్తోంది. ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో CMS-3 అతిపెద్దది. ఈ ఉపగ్రహం భారత్‌కు సమాచార సేవలు అందించనుంది. CMS-3 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఉపగ్రహం. పదేళ్లపాటు ఇంటర్నెట్ సేవలు అందించనుంది.
Updated Date - Nov 02 , 2025 | 05:49 PM