ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Explosion: ఢిల్లీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

ABN, Publish Date - Nov 10 , 2025 | 08:27 PM

ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఢిల్లి, నవంబర్ 10: ఎర్రకోట దగ్గర సోమవారం భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్‌ గేట్‌ నెంబర్‌ 1 దగ్గర పార్కింగ్‌ చేసిన కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు పేలుడు కారణంగా పరిసరాల్లో ఉన్న కార్లకు మంటలు అంటుకోగా.. సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. ఈ భారీ పేలుడు పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ఉగ్రవాదులే ఈ దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 08:27 PM