Vijayawada: దుర్గమ్మ గుడిలో ఎదురుపడ్డ రోజా.. పట్టించుకోని డిప్యూటీ స్పీకర్..
ABN, Publish Date - Sep 24 , 2025 | 08:04 PM
విజయవాడ దుర్గ గుడిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజులు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ రోజున పలువురు ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు..
విజయవాడ దుర్గ గుడిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజులు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ రోజున పలువురు ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, మరికొందరు రాజకీయ నాయకులు దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే, దుర్గ గుడి వద్ద బుధవారం నాడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దుర్గమ్మను దర్శించుకునేందుకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గుడికి వచ్చిన సమయంలో వైసీపీ నాయకురాలు ఆర్‌కే రోజా కూడా గుడిలోనే ఉన్నారు. దర్శనానికి వెళ్తున్న సమయంలో రోజా ఆయనకు తారసపడ్డారు. అయితే, రఘురామ ఆమెను పట్టించుకోకుండానే ముందుకు సాగారు. రోజా మాత్రం రాఘురామను చూసి చిరునవ్వు నవ్వారు.
Updated Date - Sep 24 , 2025 | 08:04 PM