Chandrababu Naidu: కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..
ABN, Publish Date - May 23 , 2025 | 05:21 PM
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు అవుతున్నారు. కేంద్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర సమస్యలను ఆయన కేంద్ర మంత్రులకు వివరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర సమస్యలను ఆయన కేంద్ర మంత్రులకు వివరిస్తున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్‌తో సమావేశం సందర్భంగా.. అంతరిక్ష తయారీ, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ ఒక సమగ్ర ప్రతిపాదనను సీఎం సమర్పించారు. ఈ ప్రతిపాదనలో రాష్ట్ర మద్దతుతో రెండు స్పేస్ సిటీల అభివృద్ధికి సంబంధించిన వివరాలున్నాయి. వీటిలో ఒకటి ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రం సమీపంలో, మరొకటి లేపాక్షి వద్ద ఉంటాయి.
ఇవి కూడా చూడండి
ఎలక్ట్రిక్ బస్సు చోరీ.. దొంగ ఏం చేశాడంటే
Updated Date - May 23 , 2025 | 09:55 PM