ఎలక్ట్రిక్ బస్సు చోరీ.. దొంగ ఏం చేశాడంటే

ABN, Publish Date - May 23 , 2025 | 04:51 PM

Electric Bus Theft: తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. అయితే బస్సును చోరీ చేసిన సదరు దొంగ.. చివరకు ఓ ఘాట్ రోడ్డు వద్ద వదిలేసి పరారయ్యాడు.

తిరుపతి, మే 23: తిరుపతిలో (Tirupati) బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్ బస్సు చోరీ (Electric Bus Theft) అయ్యింది. తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు చింతకుమ్మదిన్నె ఘాట్‌లో చోరీ అయిన ఎలక్ట్రిక్ బస్సును గుర్తించారు. ఘాట్‌ రోడ్డులో మలుపు తిప్పలేక బస్సును వదిలేశాడని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో ఉన్న ఎలక్ట్రిక్ బస్సును అక్కడి నుంచి తీసుకువచ్చి మేనేజర్‌కు అప్పగించారు.


బస్సు చోరీ అయిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా బస్సును ఎవరు చోరీ చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Covid 19: కరోనా కలకలం.. ఏపీలో మరో కేసు

ఎలుగుబంటి హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు

Read Latest AP News And Telugu News

Updated at - May 23 , 2025 | 05:08 PM