Ys Jagan Reacts: వైసీపీ నేతలకు పోలీస్ నోటీసులపై జగన్ రియాక్షన్
ABN, Publish Date - Sep 10 , 2025 | 01:48 PM
రైతుల తరఫున పోరాడినందుకే వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలైన మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురికి నోటీసులు వచ్చాయని గుర్తు చేశారు.
ఏపీలో వైసీపీ నేతలైన కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, అంబటి రాంబాబులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైతుల సమస్యలపై పోరాటం చేసినందుకే ఈ నోటీసులు ఇచ్చారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Ys Jagan) తీవ్రంగా స్పందించారు. ఎరువులు సకాలంలో అందిస్తే రైతులు రోడ్లపై నిరసనలు చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండు నెలలుగా రైతులు ఎరువుల కోసం క్యూలలో నిలబడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, విజయనగరం సహా అనేక ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తి చూపారు.
Updated Date - Sep 10 , 2025 | 01:50 PM