పోలీస్ కస్టడీకి వైసీపీ నేత..
ABN, Publish Date - May 23 , 2025 | 02:09 PM
YCP Leader: మాచర్లకు చెందిన తెల్లా శివకుమార్, అతని కుటుంబ సభ్యులపై హత్యాయత్నం కేసులో అరెస్టయి గుంటూరు జిల్లా జైల్లో తురకా కిషోర్ ఉన్నారు. అతనిని విచారించేందుకు కస్లడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను విచారించిన మాచర్ల న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
పల్నాడు జిల్లా: వైసీపీ నేత (YCP Leader), మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ (Macherla former chairman) తురకా కిషోర్ (Turaka Kishore)ను పోలీసులు (Police) కస్టడీ (Custody)లోకి తీసుకున్నారు. భూ కబ్జా, హత్యాయత్నం కేసులో రెండు రోజులపాటు కిషోర్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతనిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Also Read: కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్
మాచర్లకు చెందిన టీ. శివకుమార్, అతని కుటుంబ సభ్యులపై హత్యాయత్నం కేసులో అరెస్టయి గుంటూరు జిల్లా జైల్లో తురకా కిషోర్ ఉన్నారు. అతనిని విచారించేందుకు కస్లడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను విచారించిన మాచర్ల న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు కిషోర్‌ను విచారించాలని కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ లెటర్ ఎక్కడ ప్లాన్ చేశారో నాకు తెలుసు..
బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారు..
For More AP News and Telugu News
Updated Date - May 23 , 2025 | 02:09 PM