Minister Komati Reddy: ఆ లేఖకు, కవితకు సంబంధమే లేదు
ABN , Publish Date - May 23 , 2025 | 01:11 PM
Minister Komati Reddy: కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని, వందేళ్ళయినా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కవిత గురించి ఆలోచించే సమయం తనకు లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు.

Minister Komati Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR)కు రాసిన లేఖ (Letter)పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) స్పందించారు. ఈ సందర్బంగా శుక్రవారం మంత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.. కేటీఆర్ (KTR), హరీష్‌రావు (Harishrao) కలిసి కవిత పేరుతో లేఖ రాశారని, ఆ లేఖకు, కవితకు సంబంధమే లేదని అన్నారు. లెటర్ ఆలోచన ఎలా వచ్చిందో, ఎక్కడ ప్లాన్ వేశారో తనకంతా తెలుసునని, ఆర్టిఫీషియల్ (Artificial) లేఖను కూడా సరిగా రాయలేకపోయారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP)తో కలుస్తుందని, 20 లేదా 30 సీట్లలోనే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
వందేళ్ళయినా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుంది..
కేసీఆర్ కుటుంబంలో కలహాలు అనేది పెద్ద డ్రామా అని, వందేళ్ళయినా కేసీఆర్ కుటుంబం కలిసే ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. కవిత గురించి ఆలోచించే సమయం తనకు లేదన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ ఉంటుందని అన్నారు. వరంగల్‌లో కేసీఆర్ పెట్టిన సభ తాను ఒక్కడినే పెట్టగలనని.. వాట్సాప్‌లో మెసేజ్ పెడితే... తన కోసం పది లక్షల మంది వస్తారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Also Read: బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారు..
డీకే అరుణ హాట్ కామెంట్స్...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం మహబూబ్ నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని, ఈ కుట్రలో భాగమే కవిత లేఖ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఒక ముఖ్య నాయకుడు.. ఈ లేఖ వెనక ఉన్నారని ఆమె ఆరోపించారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్‌ను కలిసే పరిస్థితి కూడా కవితకు లేదా అని అన్నారు. అసలీ లేఖ కవిత రాసిందేనా.. రాస్తే ఎలా బయటకు వచ్చింది.. ఎవరు రిలీజ్ చేసారని డీకే అరుణ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, కేసీఆర్ బలహీనపడ్డారు కనుకనే.. బీజేపీపై విమర్శల స్థాయి తగ్గించారన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. ఈసారి ఏ ఎన్నికలు వచ్చిన తెలంగాణాలో బీజేపీ గెలిపించాలనే ఉద్దేశం ప్రజల్లో మొదలైందన్నారు. గత అసెంబ్లీ.. పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసిందని, వచ్చే ఏ ఎన్నికలైనా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, గెలుస్తుందని డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్ తీరుపట్ల ఎమ్మెల్సీ కవిత ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ తీరుపై నేరుగా కేసీఆర్‌కే ప్రశ్నలు సంధించారు కవిత. తన సందేహాలను వ్యక్తం చేస్తూ గురువారం నాడు కేసీఆర్‌కు సంచలన లేఖ రాశారు కవిత. ఈ లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
బీఆర్ఎస్ నిర్ణయాలు, వ్యవహారాలపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. పార్టీ లీడర్స్‌కి యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత తన లేఖలో ఆరోపించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు లేఖ రాసిన కవిత.. బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై తన సందేహాలను వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై సిల్విర్ జూబ్లీ సభలో కూడా క్లారిటీ ఇవ్వలేదన్నారు. బీజేపీ మీద రెండు నిమిషాలే మాట్లాడారని.. ఆ పార్టీపై ఇంకా బలంగా మాట్లాడాల్సిందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ మొదలైందన్నారు కవిత. తాను సఫర్ అయ్యాను కదా.. బహుశా అందుకని కావొచ్చు అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందని కవిత తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ.. బిజీ..
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
For More AP News and Telugu News