తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం
ABN, Publish Date - May 12 , 2025 | 12:54 PM
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒక వైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. సోమవారం ఏపీలో 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్టోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) వేగంగా కదులుతున్నాయి. ఈ ఏడాది ముందుగానే కేరళ (Kerala)ను తాకనున్నాయి. మంగళవారం దక్షిణ అండమాన్ సముద్రం (Andaman Sea) నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది.
Also Read: లక్షా 75వేల ఎకరాలు తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్...
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒక వైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. సోమవారం ఏపీలో 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్టోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, తూర్పోగోదావరి జిల్లాల్లోని 29 మండల్లో తీవ్రంగా.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాలోని మరో 41 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చకూపుతాయని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
నా నిర్ణయంలో మార్పు ఉండదు: కోహ్లీ
అలాంటి నేతకు విశాఖ జిల్లా బాధ్యతలా..
For More AP News and Telugu News
Updated Date - May 12 , 2025 | 12:54 PM