Share News

MLC Kavitha: లక్షా 75వేల ఎకరాలు తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్...

ABN , Publish Date - May 12 , 2025 | 11:25 AM

MLC Kavitha: తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.

MLC Kavitha: లక్షా 75వేల ఎకరాలు తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్...
BRS Leader MLC Kavitha

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)పై తీవ్రస్థాయిలో కామెంట్స్ (Cmments) చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లోని మీడియాతో మాట్లాడుతూ.. టీజీఐఐసీ (TGIIC) పరిధిలో లక్షా 75వేల ఎకరాలను తాకట్టు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్లాన్ వేశారని, తన వద్ద నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు.


తెలంగాణ భూములు స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు...

తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని కవిత అన్నారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. స్టాక్ ఎక్సేంజ్‌లో నష్టం జరిగితే తెలంగాణలో జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. గత 16 నెలల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని, తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని, అభివృద్ధికి వెచ్చించలేదని విమర్శించారు. తులం బంగారం ఇవ్వలేదని, మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయలేదని, ఏమీ చేయలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో చేసిన అప్పులకు కేవలం రూ. 80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Also Read: నా నిర్ణయంలో మార్పు ఉండదు: కోహ్లీ


మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయి...

మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నానని.. లక్ష కోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారని, ఇది 20 శాతం కమీషన్ సర్కార్ అని ఆమె అన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా 20 శాతం కమీషన్ తీసుకున్నాని ఆరోపించారు. దాదాపు రూ. 20 వేల కోట్లు రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లిందన్నారు. తాను చెప్పింది తప్పయితే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓ మంత్రి సొంత కంపెనీకి, మెఘా కంపెనీకి బిల్లులు చెల్లిస్తున్నారు తప్ప.. చేసిన అభివృద్ధి పనులకు కాదని కవిత అన్నారు. వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ. 10 వేల కోట్లు అప్పు తెచ్చారని అన్నారు. చెట్లను, ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలు ఆందోళన చేశారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అలాంటి నేతకు విశాఖ జిల్లా బాధ్యతలా..

తిరుపతి జిల్లా అగరాల వద్ద రోడ్డు ప్రమాదం.

For More AP News and Telugu News

Updated Date - May 12 , 2025 | 11:25 AM