నా నిర్ణయంలో మార్పు ఉండదు: కోహ్లీ
ABN, Publish Date - May 12 , 2025 | 10:49 AM
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో క్రికెట్ వర్గాలు ఆయనను అలా చేయవద్దని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ముంబై: కొన్ని రోజుల క్రితం టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ (Star Batter) విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టెస్టు మ్యాచ్ (Test match)ల నుంచి రిటైర్ (Retirement) కావాలని కోహ్లీ నిర్ణయించుకున్నారన్న వార్త సంచలనం రేపుతోంది. అయితే కీలకమైన ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకైనా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోహ్లీని బీసీపీఐ కోరుతోంది. ఈ మేరకు విరాట్‌ను ఒప్పించే బాధ్యతను దేశ క్రికెట్లో అత్యంత ప్రముఖుడికి అప్పగించినట్లు సమాచారం. దాంతో ఆ ప్రముఖుడు కోహ్లీని సంప్రదించినట్లు సమాచారం.
Also Read: అలాంటి నేతకు విశాఖ జిల్లా బాధ్యతలా..
అయినా విరాట్ కోహ్లీ మాత్రం ససేమిరా అన్నట్లు తెలిసింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాలి అన్న తన నిర్ణయంలో మార్పు ఉండబోదని కోహ్లీ ఆ ప్రముఖుడికి కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చేవారం జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలోపు కోహ్లీ రిటైర్ మెంట్‌కు సంబంధంచి తుది నిర్ణయం వెలువుతుందని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా అగరాల వద్ద రోడ్డు ప్రమాదం.
సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..
For More AP News and Telugu News
Updated at - May 12 , 2025 | 10:49 AM