ముందస్తు బెయిల్ ఇవ్వండి
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:32 PM
Raj Kasireddy: లిక్కర్ స్కాంలో నిందితుడు రాజ్ కసిరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు.
అమరావతి, ఏప్రిల్ 19: ఏపీ లిక్కర్ స్కామ్‌లో (AP Liquor Scam) నిందితుడు రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) మళ్లీ ఏపీ హైకోర్టును (AP Highcourt) ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. తాను విచారణకు సహకరిస్తానని కసిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సిట్ అధికారులు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కసిరెడ్డి విచారణకు హాజరుకాలేదు. రెండవ సారి నోటీసులు ఇచ్చిన వెంటనే కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే నోటీసుల విషయంలో జోక్యం చేసుకోబోమని కసిరెడ్డి పిటషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
అయితే మళ్లీ నిన్న (శుక్రవారం) సాయంత్రం తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టుకు వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Kids Cough Syrup Ban: నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందుపై ఆంక్షలు
Visakha Mayor: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 19 , 2025 | 12:35 PM