Kids Cough Syrup Ban: నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందుపై ఆంక్షలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:37 AM
నాలుగేళ్లలోపు చిన్నారులకు వాడే దగ్గు మందులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఎఫ్‌డీసీ కాంబినేషన్ మందులు ఆరోగ్యానికి హానికరమని నిపుణుల నివేదికలో తేలింది
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: నాలుగేళ్లలోపు చిన్నారులకు వాడే దగ్గు మందులోని ఫిక్స్‌డ్ డ్రగ్ కాంబినేషన్(ఎ్‌ఫడీసీ) వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిర్ధారణకావడంతో వాటి తయారీ, అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. క్లోర్ఫెనిరామైన్ మాలేట్, ఫినైల్ర్ఫైన్ హడ్రోక్లోరైడ్ సాధారణంగా దగ్గు సిర్‌పలో వాడతారు. జీఎ్‌సకే, గ్లెన్‌మార్క్, అలెంబిక్ వంటివి ఈ ఫార్ములాను వాడుతున్నాయి. వీటిపై విషయ నిపుణుల కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ గెజిట్ జారీ చేసింది. ‘నాలుగేళ్లలోపు చిన్నారుల్లో ఈ ఎఫ్‌డీసీ దుష్ఫలితాలు కలిగిస్తుందని స్పష్టమైంది’అని గెజిట్‌లో పేర్కొన్నారు.