లోకేష్ భళా.. మోదీ ఫిదా...
ABN, Publish Date - Jun 22 , 2025 | 07:05 AM
PM Modi: ఏపీలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి లోకేష్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
Amaravati: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో యోగాంధ్ర (Yoga Andhra) కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi).. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan)లను అభినందించారు. అయితే ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎక్కువగా అభినందించారు.. ఆయన గురించి ప్రస్తావించారు. ఆయన ఎవరంటే మంత్రి లోకేష్ (Minister Lokesh). ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించినప్పటికీ.. ఈ ఈవెంట్ నిర్వహణలో లోకేష్ చొరవ, పనితీరు గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ వేదికపైనే ఆయనను అభినందించారు. యోగాంధ్ర విజయవంతంలో లోకేష్ పాత్ర మరువలేనిదన్నారు.
ఇలాంటి కార్యక్రమాలను ఏ విధంగా జనంలోకి తీసుకెళ్లగలమో గత నెల, నెలన్నర రోజులుగా లోకేష్ చేసి చూపించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయనను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్
ఇది వికసిత్ భారత్‌కు స్ఫూర్తి: ప్రధాని మోదీ
For More AP News and Telugu News
Updated Date - Jun 22 , 2025 | 07:05 AM