ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..
ABN, Publish Date - Mar 02 , 2025 | 01:41 PM
హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అధికారులు ప్రారంభించారు. యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అధికారులు ప్రారంభించారు. యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. క్యూఆర్ కోడ్ విధానంతో టికెట్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో కండక్టర్లకు చిల్లర సమస్య తప్పినట్లైంది. మరోవైపు ప్రయాణికులకూ అనుకూలంగా ఉంది. ప్రస్తుతం చాలా మంది గూగుల్, ఫోన్‌పేలే వినియోగిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు కూడా ఈ విధానం అనూకూలంగా మారింది.
Updated Date - Mar 02 , 2025 | 01:41 PM