మారెడ్డి లతారెడ్డికి నారా భువనేశ్వరి ఫోన్..
ABN, Publish Date - Aug 14 , 2025 | 04:38 PM
పులివెందుల అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్ల మెజారిటీతో 30 ఏళ్ల తర్వాత పులివెందుల గడ్డపై విజయఢంకా మోగించారు. మరోవైపు ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి 6,154 ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగరవేశారు.
కడప: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు తెరపడింది. టీడీపీ, వైసీపీలు నువ్వా.. నేనా అన్నట్లు ప్రచారం చేసినప్పటికీ చివరికి విజయం టీడీపీని వరించింది. రెండు స్థానాల్లోనూ మంచి మెజారిటీతో టీడీపీ గెలుపు సొంతం చేసుకుంది. పులివెందుల అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్ల మెజారిటీతో 30 ఏళ్ల తర్వాత పులివెందుల గడ్డపై విజయఢంకా మోగించారు. మరోవైపు ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి 6,154 ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగరవేశారు. అయితే, ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మారెడ్డి లతారెడ్డికి ఫోన్ చేసి అభినందించారు. ఈ విజయం సమష్టి కృషి అంటూ ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pulivendula ZPTC Byelection: పులివెందులలో పులి మూగపోయింది
Eating Food Viral Video: సహపంక్తి భోజనాల్లో వింత టెక్నాలజీ.. పదే పదే తిరక్కుండా ఎలా సెట్ చేశారంటే..
Updated Date - Aug 14 , 2025 | 04:41 PM