Share News

Pulivendula ZPTC Byelection: పులివెందులలో పులి మూగపోయింది

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:41 AM

తన కంచుకోట అనే చెప్పుకునే జగన్ కు అక్కడి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారు. పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జగన్ బై చెప్పి.. టీడీపీకి జై కొట్టారు.

Pulivendula ZPTC Byelection: పులివెందులలో పులి మూగపోయింది

కడప, ఆగస్టు 14: పులివెందుల తన కంచుకోట అని చెప్పుకునే జగన్ కు అక్కడి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారు. పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జగన్‌కు బై చెప్పి.. టీడీపీకి జై కొట్టారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని భారీ మెజారితో గెలిపించారు. మరోవైపు వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేశారు. తమ అడ్డాలో తమకు అడ్డు లేరని ఎగిరిపడ్డ వైసీపీ నేతలు బోర్లా బొక్కలో పడ్డారు.

కుటుంబ, గొడ్డలి పాలన కాదు.. రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికే తమ మద్దతు అంటూ స్వల్ప మెజారిటీ కాదు భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించి బెంగళూరు ప్యాలెస్ లో ఉన్న జగన్ కు వినిపించారు. కాగా వైసీపీకి పరాకాష్టకు ఈ ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠం కావాలని అని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఎన్నిక విజయంతో పులివెందుల పసుపు మాయం అయింది. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఎన్నికల ఫలితాలు ఇలా..

  • 6,050 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపు

  • లతారెడ్డి(టీడీపీ)-6,735 ఓట్లు,

  • హేమంత్‌రెడ్డి(వైసీపీ)-685 ఓట్లు

Updated Date - Aug 14 , 2025 | 11:46 AM