పసికందును 6 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టిన తల్లి
ABN, Publish Date - Nov 22 , 2025 | 02:00 PM
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి పేగు బంధాన్ని మరిచిపోయింది. కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆరు లక్షల రూపాయలకు మగబిడ్డను అమ్మడానికి ప్రయత్నించింది.
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి పేగు బంధాన్ని మరిచిపోయింది. కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆరు లక్షల రూపాయలకు మగబిడ్డను అమ్మడానికి ప్రయత్నించింది. ఓ యువతి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రేమికుడు మోసం చేయటంతో బిడ్డను అమ్మాలని అనుకుంది. గన్నేరువరం మండలం చాకినివానిపల్లెకు చెందిన రాయమల్లు, లత దంపతులకు బిడ్డను అమ్మకానికి పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు విక్రయానికి సహకరించిన 16 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఇవి చదవండి
ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు
మనీ ప్లాంట్ పసుపు రంగులోకి మారుతుందా? ఈ చిట్కా ట్రై చేయండి
Updated Date - Nov 22 , 2025 | 02:04 PM