Home Remedies for Money Plant: మనీ ప్లాంట్ పసుపు రంగులోకి మారుతుందా? ఈ చిట్కా ట్రై చేయండి
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:38 PM
మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ పసుపు రంగులోకి మారుతుందా? అయితే, ఈ హోం రెమెడీని ఒక్కసారి ట్రై చేసి చూడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో మనీ ప్లాంట్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది సంపద, అదృష్టం, శ్రేయస్సు కలిగిస్తుందని ఎక్కువగా నమ్ముతారు. కొన్నిసార్లు మనీ ప్లాంట్ పసుపు రంగులోకి మారడం మనం చూస్తుంటాం. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది? మనీ ప్లాంట్ ఆకులు మళ్లీ ఆకుపచ్చ రంగులోకి మారలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారడానికి సాధారణ కారణాలు అధికంగా లేదా తక్కువగా నీరు పెట్టడం, తగినంత కాంతి లేకపోవడం లేదా ఎక్కువ ఎరువులు వాడటం. కాబట్టి, శీతాకాలంలో మనీ ప్లాంట్‌కు తక్కువగా నీరు పట్టాలని వ్యవసాయ నిపుణులు సలహా ఇస్తున్నారు. అధికంగా నీరు పట్టడం వల్ల మొక్క వేర్లు కుళ్ళిపోతాయని చెబుతున్నారు.
కాబట్టి, నేల పూర్తిగా ఎండిపోయిన తర్వాత మాత్రమే మనీ ప్లాంట్‌కు నీరు పట్టండి. ఆకులు పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తే, వెంటనే నీరు పట్టడం మానుకోండి. అలాగే, మొక్కకు తగినంత పరోక్ష సూర్యకాంతి అందేలా చూడాలి. అంటే, మొక్కను పరోక్ష కాంతిని అందుకునే ప్రదేశంలో ఉంచండి. గది లేదా బాల్కనీలో బాగా వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచండి.అంతేకాకుండా, వారానికి ఒకసారి మనీ ప్లాంట్‌కు కడిగిన బియ్యం నీరు పోయండి. ఇందులో కార్బోహైడ్రేట్లు, సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి మొక్కను క్రమంగా బలోపేతం చేస్తాయి.
Also Read:
జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?
డ్రాగన్ ఫ్రూట్.. ఈ సమస్యలు ఉన్నవారికి మంచిది.!
For More Latest News