Modi Diwali Gift: సామాన్యులకు మోదీ దీపావళి గిఫ్ట్..భారీగా తగ్గనున్న ధరలు
ABN, Publish Date - Aug 19 , 2025 | 10:03 PM
గత పండుగ సీజన్‌కి ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారిన క్రమంలో, ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో పరిస్థితి మారబోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
ఈ దీపావళికి సామాన్యుల కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. గతంలో పండుగ సీజన్ వచ్చేసరికి ధరలు పైపైకి చేరుకోగా, ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి (Modi Diwali Gift 2025). ముఖ్యంగా గోధుమలు, శనగ, పప్పులు, వంట నూనెలు వంటి వస్తువులపై ధరల తగ్గింపు కనిపించనుంది. దీనివల్ల మిడిల్ క్లాస్ కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. దీపావళికి ముందుగా కొనుగోలు చేసే వారికీ ఇది అదనపు ఆనందంగా మారబోతోంది.
Updated Date - Aug 19 , 2025 | 10:03 PM