ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

షాప్‌ను సీజ్ చేసేయండి.. మంత్రి ఆర్డర్

ABN, First Publish Date - 2025-04-09T14:56:05+05:30

Nadendla Manohar Anger: ఢిల్లీలో పౌరసరఫరాల శాఖ దుకాణం సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షాప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఢిల్లీ ఏపీ భవన్‌లోని పౌరసరఫరాల శాఖ దుకాణంలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. షాపులో బియ్యం నాణ్యతను మంత్రి నాదెండ్ల, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ,ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ పరిశీలించారు. బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని గమనించారు. అలాగే బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ పేరుతో ఇక్కడ బియ్యం షాపు నడిపిస్తున్నారని.. వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమ్మే బియ్యంలో నాణ్యత లేదని.. 26 కేజీల బియ్యం బస్తా 25 కేజీలు మాత్రమే ఉందని తెలిపారు.


వేయింగ్ మిషన్ కూడా సరిగా పనిచేయడం లేన్నారు. 26 కేజీల బియ్యం బస్తాను చెక్ చేయగా.. అందులో నూకల శాతం ఎక్కువగా ఉందని గమనించారు. కాకినాడకు చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి 2021లో షాపు కేటాయించినట్లు తెలుస్తుంది. బియ్యంలో నాణ్యత లేదని వెంటనే షాప్‌ సీజ్ చేయాలని ఆదేశించిన మంత్రి.. మరో నెల రోజులోగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరపున రేషన్‌ స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరులకును అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Trump China Tariffs: చైనాపై ట్రంప్‌ బాదుడు 104 శాతానికి!

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-04-09T14:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising