Minister Kondapalli Srinivas:పెన్షన్ల పై దుష్ప్రచారం.. వైసీపీపై మంత్రి ఫైర్..
ABN, Publish Date - Aug 22 , 2025 | 02:02 PM
ప్రభుత్వం అర్హుల పెన్షన్లు తొలగిస్తోందని గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్న వైసీపీ పార్టీ నేతల ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలేనని కొట్టిపడేస్తూ పెన్షన్ల విషయంలో ప్రభుత్వ విధివిధానాలపై క్లారిటీ ఇచ్చారు.
ప్రభుత్వం అర్హుల పెన్షన్లు తొలగిస్తోందని గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్న వైసీపీ పార్టీ నేతల ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలేనని కొట్టిపడేస్తూ పెన్షన్ల విషయంలో ప్రభుత్వ విధివిధానాలపై క్లారిటీ ఇచ్చారు. కూటమి అధికారం చేపట్టి 15 నెలలు కావొస్తోందని.. ఈ వ్యవధిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం 65 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా 4 లక్షల 50 వేలు పెన్షన్లను తొలగించారంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోందని.. దమ్ముంటే ఆధారాలు ఇవ్వాలని సవాల్ విసిరారు.
Updated Date - Aug 22 , 2025 | 02:02 PM