అధికారుల నిర్లక్ష్యమే.. గుల్జార్‌హౌజ్ ఘటనపై విచారణ జరపాలి
ABN, Publish Date - May 31 , 2025 | 04:47 PM
Gulzar House Fire Accident: అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబంలో 17 మందిని కోల్పోయామని గుల్జార్ హౌజ్ బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. త్వరగా మంటలను అదుపు చేసి ఉంటే తమ వారి ప్రాణాలు దక్కేవని అన్నారు.
హైదరాబాద్, మే 31: గుల్జార్‌హౌజ్ అగ్ని ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే 17 మందిని కోల్పోయామని బాధిత కుటుంబీకులు సంతోషి, నితీష్ గుప్తా అన్నారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ.. ఘటనాస్థలికి ఫైర్ సిబ్బంది 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చారన్నారు. ఫైర్ ఇంజన్‌లో వాటర్ కూడా లేవని.. సుమారు గంటన్నర సమయాన్ని ఫైర్ సిబ్బంది వృధా చేశారన్నారు. త్వరగా మంటలను అదుపు చేసుంటే 17 ప్రాణాలు దక్కేవని నితీష్ గుప్తా అన్నారు. ఫైర్ సమయంలో బాధితులను తరలించడానికి అంబులెన్స్‌లో కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. శతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్తే వైద్యుల నిర్లక్ష్యంతో ముగ్గురు చనిపోయారని ఆరోపించారు.
అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే తమ ఫ్యామిలీలో 17 మందిని కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
గోశాలల ఏర్పాటుకు కమిటీ.. ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్
పెన్షన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Read Latest Telangana News and National News
Updated Date - May 31 , 2025 | 04:48 PM