Gold Rates Hike: సామాన్యులు బంగారం కొనగలరా? (Video)
ABN, Publish Date - Sep 10 , 2025 | 11:07 AM
బంగారం ధరలు ఆకాశానికి నిచ్చెన వేస్తూ సామాన్యులకు కొనేందుకు వీలు కాకుండా చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 10గ్రాముల బంగారం ధర రూ.5,080 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు సృష్టించింది.
పసిడి చుక్కలనంటుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ దీని ధర సరికొత్త శిఖరాలకు దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మంగళవారం రూ.5,080 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.1,12,750కి ఎగబాకింది. ప్రస్తుతం పెరుగుతున్న ఈ ధరలు సామాన్యులను ఆందోళనకు నెట్టేస్తోంది. పెరుగుతున్న ఈ బంగారం ధరలపై ABN ప్రత్యేక కథనం..
Updated Date - Sep 10 , 2025 | 11:07 AM