ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంగ్లీష్ వద్దన్న రఘురామ.. కారణమిదే

ABN, First Publish Date - 2025-03-03T17:03:11+05:30

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల గురించి ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడారు. అయితే ఎమ్మెల్యే ప్రసంగం మొత్తం ఇంగ్లీలోనే ఉంది. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామ స్పందించారు.

అమరావతి, మార్చి 3: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో పుట్టపర్తి ఎమ్మెల్యే పి. సింధూరరెడ్డి (MLA Sindhura Reddy).. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై మాట్లాడారు. అయితే సభలో ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (Deputy Speaker Raghurama Krishnam Raju) చిన్న సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే తన ప్రసంగం మొత్తాన్ని ఇంగ్లీష్‌లో చదివి వినిపించారు. దీనిపై స్పందించిన రఘురామ.. ‘‘మీరు సభలో తెలుగులో మాట్లాడితే.. అసెంబ్లీ సభ్యులే కాదు.. మీ నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషిస్తారు. మళ్లీ అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు.. సాధ్యమైతే తెలుగులో మాట్లాడండి’’ అంటూ ఎమ్మెల్యే సింధూర రెడ్డిని డిప్యూటీ స్పీకర్ కోరారు. దీనికి ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు.


ఇక తన ప్రసంగంలో... అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రానికి మేలు చూకూరుతోందని అన్నారు ఎమ్మెల్యే. ఆర్థికాభివృద్ధితో పాటు వ్యవసాయాభివృద్ధి కూడా జరుగుతుందని తెలిపారు. పంచాయతీ రహదారుల నిర్మాణానికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిగాయని.. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికు కూడా ఎమ్మెల్యే సింధూరరెడ్డి కృతజ్జతలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-03-03T17:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising