ఢిల్లీలో విషాదం
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:51 PM
Delhi Tragedy: ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఆరు అంతస్థుల భవనం కుప్పకూలడంతో నలుగురు మృత్యువాత పడ్డారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) ముస్తఫాబాద్‌లో ఘోర విషాదం జరిగింది. ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఈరోజు(శనివారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Kids Cough Syrup Ban: నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందుపై ఆంక్షలు
Hyderabad Weather: ఏంటీ వాతావరణం.. ఓ వైపు ఎండ.. మరోవైపు వర్షం
Read Latest National News And Telugu News
Updated Date - Apr 19 , 2025 | 12:51 PM