డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి
ABN, Publish Date - Oct 31 , 2025 | 09:55 PM
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడు సాయితేజ ఎంవీపీ కాలనీలో ఉన్న సమత కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం చూసేసరికి ఉరేసుకొని చనిపోయినట్లు కనిపించాడు.
విశాఖ, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడు సాయితేజ ఎంవీపీ కాలనీలో ఉన్న సమత కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం చూసేసరికి ఉరేసుకొని చనిపోయినట్లు కనిపించాడు. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులతోనే సాయితేజ సూసైడ్ చేసుకున్నాడని విద్యార్ది నాయకులు, తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కళాశాల ముందు ధర్నాకు దిగారు. మరింత సమాచారం కొరకు క్రింది వీడియోని చూడండి.
ఇవి కూడా చదవండి:
Central Govt Award: ఏపీ ఫొరెన్సిక్ అధికారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం
CM Chandrababu: పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్
Updated Date - Nov 01 , 2025 | 10:53 AM