Share News

Central Govt Award: ఏపీ ఫొరెన్సిక్ అధికారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం

ABN , Publish Date - Oct 31 , 2025 | 09:33 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొరెన్సిక్ అధికారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కింది. 2025 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘కేంద్రీయ గృహమంత్రి దక్షిత’ పతాకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (APFSL) DNA విభాగంలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న బొమ్మకంటి ఫణిభూషన్ ఎంపికయ్యారు.

Central Govt Award: ఏపీ ఫొరెన్సిక్ అధికారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం
Central Government Award

అమరావతి, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొరెన్సిక్ అధికారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం (Central Government Award) దక్కింది. 2025 సంవత్సరానికి గానూ కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘కేంద్రీయ గృహమంత్రి దక్షిత’ పతాకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (APFSL) DNA విభాగంలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న బొమ్మకంటి ఫణిభూషన్ (Bommakanti Phanibhushan) ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఫణిభూషన్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) అభినందించారు.


ఫణిభూషన్ ఎంపిక ఏపీకి గర్వకారణం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

DGP harish Kumar Gupta.jpg

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఫణిభూషన్ ఎంపిక ఏపీకి గర్వకారణమని ఉద్ఘాటించారు. ఆయన అందించిన సేవలకు గానూ కేంద్రప్రభుత్వం ‘గృహమంత్రి దక్షత’ పతాకాన్ని ప్రకటించిందని తెలిపారు. ఫొరెన్సిక్ విభాగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, నిధులు, శాస్త్రీయ పరికరాల లభ్యత, నేరస్థుల పరిశీలన, మార్గదర్శకాలు, త్వరితగతిన నేరస్థుల సందర్శన, నైపుణ్యసహిత నివేదికలు, దీర్ఘకాలిక జాప్య నివేదికలను తక్షణమే నివేదించటం వంటివి ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (APFSL) సంక్లిష్టమైన కేసుల పరిష్కారంలో దేశంలోనే ప్రథమస్థానం సాధిస్తుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: పవన్ కల్యాణ్

టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 10:05 PM