చీనాబ్ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగు మహిళ ప్రత్యేక పాత్ర
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:49 PM
Chenab Bridge: చీనాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు తేజం డాక్టర్ మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎస్‌సీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ప్రకాశం, జూన్ 9: భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge) నిలిచింది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు తేజం డాక్టర్ మాధవీలత (Madhavi Latha) కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎస్‌సీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కందుకూరులోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో చదువుకున్న మాధవీలత జేఎన్‌టీయూ కాకినాడలో ఇంజనీరింగ్, వరంగల్ నిట్‌లో ఎంటెక్ పూర్తి చేశారు.
మద్రాస్ ఐఐటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో రాక్ మెకానిక్స్‌లో పోస్ట్ డాక్టోరియల్ ఫెలోషిప్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
రెండు నెలల్లో సేవలన్నీ వాట్సప్‌లో: చంద్రబాబు
ఆగ్రహావేశాలు.. సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 04:54 PM