CM Chandrababu: రెండు నెలల్లో సేవలన్నీ వాట్సప్‌లో: చంద్రబాబు
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:30 PM
CM Chandrababu: రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జి, టూల్స్ అన్ని రెడీగా ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ అనేదీ ఫ్యాషన్ కాదు.. గేమ్ ఛేంజర్ అని తెలిపారు. పేదరికం లేని ఏపీని తయారు చేస్తామని.. అందుకే పీ4 కార్యక్రమం తీసుకువచ్చామని అన్నారు.

అమరావతి, జూన్ 9: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల స్వర్ణాంధ్ర కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (సోమవారం) వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా అని అన్నారు. బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చాంధ్రను అమలు చేస్తున్నామని తెలిపారు. డీప్ టెక్‌తో టెక్నలజీ బాగా పెరిగిందన్నారు. వాట్సప్ గవర్నెన్స్‌తో ఆన్‌లైన్ సేవలు అందుతున్నాయని తెలిపారు.
రెండు నెలల్లో అన్ని సర్వీస్‌లు వాట్సప్‌లో ఉంటాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో డేటా నాలెడ్జి, టూల్స్ అన్ని రెడీగా ఉంటాయని అన్నారు. టెక్నాలజీ అనేదీ ఫ్యాషన్ కాదు.. గేమ్ ఛేంజర్ అని తెలిపారు. పేదరికం లేని ఏపీని తయారు చేస్తామని.. అందుకే పీ4 కార్యక్రమం తీసుకువచ్చామని అన్నారు. ఆదాయం పెరగాలని ఆరోగ్యం, ఆనందం ఉండాలని ఆకాంక్షించారు. 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ విజన్ డాక్యుమెంట్ తయారైనట్లు తెలిపారు. 26 జిల్లాల్లో రోడ్ మ్యాప్ మండలాల వారీగా కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఒక్కోలా ఉంటుందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయం తక్కువ, ఉద్యానవన పంటలు ఎక్కువ ఉంటాయన్నారు. మరొకొన్ని జిల్లాల్లో ఆక్వా, డైరీ ఇలా అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో అనుకూలమైన సర్వీస్ సెక్టార్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హాస్పిటల్, టూరిజం ఇలా అన్ని రంగాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
మరోవైపు జాతీయ రహదారులు, రాష్ట్రంలో రోడ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో శరవేగంగా రహదారుల నిర్మాణం జరగాలన్నారు. జూలై నెలాఖరుకు ఆటంకాలు తొలిగించాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది 1,040 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలన్నారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు.
నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. ఎన్‌హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద రూ.11,325 కోట్లతో 770 కి.మీ రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. రూ.20,067 కోట్ల విలువైన 1,040 కి.మీ. రహదారి పనులు పూర్తి కావాలని సూచించారు. 1,307 కి.మీ పొడవైన అత్యంత రద్దీ కలిగిన 18 రహదారుల డీపీఆర్ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. మిగిలిన 8,893 కి.మీ.పొడవైన 242 రహదారుల ఫ్రీ విజబిలిటీ అధ్యయనాన్ని రెండు విడతల్లో చేపట్టాట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం సూచనల మేరకు అదనంగా యలమంచిలి - గాజువాక, గాజులమండ్యం - శ్రీసిటీ రహదారుల్ని కూడా పీపీపీ విధానంలో అభివృద్ధి జరుగనుంది.
ఇవి కూడా చదవండి
ఏపీలో ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్ ప్రదానం
ఆగ్రహావేశాలు.. సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Read Latest AP News And Telugu News