Nara Lokesh: మంత్రి లోకేష్ సీరియస్..కొమ్మినేని అరెస్టుకు కౌంట్‌డౌన్?
ABN, Publish Date - Jun 07 , 2025 | 10:07 PM
కొమ్మినేని వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
కొమ్మినేని వ్యాఖ్యల విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనివార్యమని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మహిళలను అవమాన పరిచే విధంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Jun 07 , 2025 | 10:08 PM