ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు

ABN, Publish Date - May 17 , 2025 | 04:36 AM

పహల్గామ్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో తెలుగు యువకుడు కీలక పాత్ర పోషించాడు.

  • ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక పాత్ర

  • ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ బాధ్యతల్లో లక్ష్మీకాంత్‌రెడ్డి

కోహీర్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): పహల్గామ్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో తెలుగు యువకుడు కీలక పాత్ర పోషించాడు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలోని రాజనెల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల లక్ష్మీకాంత్‌రెడ్డి 2019లో భారత వైమానిక దళానికి ఎంపికయ్యారు. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా పంజాబ్‌ రాష్ట్రంలోని అదంపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.


రాజనేల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పట్లోళ్ల రాజవర్ధన్‌రెడ్డి పెద్ద కుమారుడు లక్ష్మీకాంత్‌రెడ్డి. పాకిస్థాన్‌ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ముందుగానే గుర్తించి నాశనం చేసిన అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఎస్‌-400 ఆపరేటింగ్‌ విధులు నిర్వహించారు. ఆపరేషన్‌ సింధూర్‌ ముగిసిన అనంతరం అదంపూర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా లెఫ్టినెంట్‌ లక్ష్మీకాంత్‌రెడ్డిని అభినందించారు.

Updated Date - May 17 , 2025 | 04:36 AM