ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: యువత జోష్‌... మాబ్‌ డ్యాన్స్‌

ABN, Publish Date - Feb 11 , 2025 | 10:17 AM

హైటెక్‌ సిటీ రోడ్డు(Hi-Tech City Road)లో అంతా ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టుండి పీపుల్స్‌ ప్లాజా సమీపంలో మెరుపులా ఒక యువతి డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టింది. మరి కొందరు యువకులు ఆమెకు జత కలిశారు. అంతే డ్యాన్స్‌ షురూ అయింది.

- సామాజిక అంశాలపై చైతన్యం కలిగిస్తూ కార్యక్రమాలు

హైదరాబాద్: హైటెక్‌ సిటీ రోడ్డు(Hi-Tech City Road)లో అంతా ప్రశాంతంగా ఉంది. ఉన్నట్టుండి పీపుల్స్‌ ప్లాజా సమీపంలో మెరుపులా ఒక యువతి డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టింది. మరి కొందరు యువకులు ఆమెకు జత కలిశారు. అంతే డ్యాన్స్‌ షురూ అయింది. హుషారెత్తించే గీతానికి అదే స్థాయిలో, వేగంగా పదం కలుపుతూ ఊగిపోతున్నారు. వీరిని గమనించిన సామాన్య జనం చుట్టు చేరారు. వారిలో ఉత్సాహవంతులు కొందరు డ్యాన్స్‌ చేస్తున్న బృందంలో చేరి తామూ కొన్ని స్టెప్పులు వేశారు. కొంత సేపటికి సందడి ముగిసింది. గో గ్రీన్‌.. సేవ్‌ ప్లానెట్‌ ప్రచారంలో భాగంగా ఆ యువత నృత్యం చేశారు. నగరంలో జరుగుతున్న ఈ సందడి పేరు మాబ్‌ డ్యాన్స్‌, ప్రస్తుతం యువత దీనిపై మోజు పెంచుకుంటోంది.

ఈ వార్తను కూడా చదవండి: Check bounce: చెక్‌ బౌన్స్‌ అయిందా.. దుకాణానికి తాళమే


పాశ్చాత్యం నుంచి...

అమెరికాలోని మన్‌హట్టన్‌లో బిల్‌ వాసిల్‌ అనే వ్యక్తి మాబ్‌ డ్యాన్స్‌ సృష్టికర్త. నృత్యం, వినోదం మిళితంగా.. బృందంగా ఏర్పడిన యువత సాగించే ఈ నృత్యం అత్యంత వేగంగా అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. న్యూయార్క్‌లోని ది వాల్‌ స్ట్రీట్‌. జనరల్‌లో దాదాపు ఐదు వేల మంది మాబ్‌ డ్యాన్స్‌లో పాల్గొని రికార్డు సృష్టించారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలన్నింటిలోను ఈ డ్యాన్స్‌ పాగా వేసింది. క్రమంగా మన దేశానికి వ్యాపించింది. ముంబాయిలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని దాదాపు వేయి మంది ఈ మాబ్‌ డ్యాన్స్‌లో పాల్గొన్నారు. మాబ్‌డ్యాన్స్‌ చేయాలనుకునేవారంతా సోషల్‌ నెట్‌వర్క్‌తోపాటు మొబైల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.


రెండు సంవత్సరాల క్రితం బంజారాహిల్స్‌ జీవీకే వన్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించారు. నో డ్రింకింగ్‌.. నో డ్రైవింగ్‌ పేరుతో ఈ డ్యాన్స్‌ను చేశారు. షాపింగ్‌ కోసం వచ్చిన వారంతా వారితో జతకలిసారు. పీపుల్స్‌ప్లాజాలోనూ గో గ్రీన్‌ పేరుతో మాబ్‌ డ్యాన్స్‌ చేశారు. ఈ రెండు వేదికలపై మంచి స్పందన రావడంతో యువకులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు సామాజిక అంశాలను ఎంచుకొని వాటిపై మాబ్‌ నృత్యాలు చేయ డం మొదలు పెట్టారు. మాదాపూర్‌, హైటెక్‌సిటీలో ప్రతి వారాంతం మాబ్‌ డ్యాన్స్‌లు జోరందుకుంటున్నాయి. షాపింగ్‌ మాల్స్‌లలో కూడా ప్రత్యేక మైన రోజుల్లో మాబ్‌ డ్యాన్స్‌ చేస్తున్నారు.


తేలికగా... వడివడిగా

మాబ్‌ డ్యాన్స్‌ కోసం యువకులంతా ముందుగానే స్టెప్పులు నేర్చుకుంటారు. అవి సులువుగా ఉంటాయి. ఈ ప్రక్రియ కొంత వేగంగా, మెరుపులా చేయాల్సినది అని చెబుతున్నారు. ఫిట్‌నెస్‌ ట్రైనర్లు, సులువైన డ్యాన్స్‌ నేర్పడంతో జనం మధ్యలో చేసే సమయంలో స్థానికులు జత కలిసేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. నగరంలోని స్కూళ్లు, కళాశాలలు, ఎంఎన్‌సీ సంస్థలు ఇలాంటి నృత్యాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మాబ్‌ డ్యాన్స్‌ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎంతో దోహదం చేస్తుందని ఫిట్‌నెస్‌ ట్రైనర్లు అంటున్నారు.


ఆరోగ్యానికి మంచిదే..

మాబ్‌ డ్యాన్స్‌ చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచదని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నృత్యాం దాదాపు పది నిమిషాల పాటు ఉం టుంది. ఇలా కనీసం ఐదు పాటలు అంటే సుమారు గంట పాటు ఎదో రకంగా శరీర అవయవాలను కదిలిస్తుంటారు. ఇలా చేయడం కూడా ఓ వ్యాయమమే అంటున్నారు జిమ్‌ ట్రైనర్లు. ఎయిరోబిక్స్‌ మాదిరిగా మాబ్‌ డ్యాన్స్‌ను కూడా ఎక్సర్‌సైజ్‌ కింద భావించవచ్చన్నారు. మరెందుకు ఆలస్యం ప్రజలను చైతన్య పరిచేందుకు మీరు కూడా మాబ్‌ డ్యాన్సులో పాలుపంచుకోండిక.


ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 10:17 AM