Share News

Check bounce: చెక్‌ బౌన్స్‌ అయిందా.. దుకాణానికి తాళమే

ABN , Publish Date - Feb 11 , 2025 | 09:46 AM

వ్యాపార సంస్థలు జీహెచ్‌ఎంసీ(GHMC)కి ఇచ్చిన వ్యాపార పన్ను చెల్లింపు చెక్‌ బౌన్స్‌(Check bounce) అయిందా.. అయితే దుకాణానికి తాళమే.. చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో 2025-26 వార్షిక సంవత్సరానికి చెల్లించాల్సిన వ్యాపార పన్నును వివిధ రకాలుగా చెల్లించవచ్చు.

Check bounce: చెక్‌ బౌన్స్‌ అయిందా.. దుకాణానికి తాళమే

హైదరాబాద్: వ్యాపార సంస్థలు జీహెచ్‌ఎంసీ(GHMC)కి ఇచ్చిన వ్యాపార పన్ను చెల్లింపు చెక్‌ బౌన్స్‌(Check bounce) అయిందా.. అయితే దుకాణానికి తాళమే.. చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో 2025-26 వార్షిక సంవత్సరానికి చెల్లించాల్సిన వ్యాపార పన్నును వివిధ రకాలుగా చెల్లించవచ్చు. అన్‌లైన్‌డిజిటల్‌, మీ-సేవ లేదా నగదు, లేదా డీడీ, చెక్‌(DD, check) ద్వారా చెల్లించేందుకు జీహెచ్‌ఎంసీ అవకాశం ఇచ్చింది. కొందరూ వివిధ రకాలుగా చెల్లించారు. కొందరూ చెక్‌లు ఇచ్చారు.

ఈ వార్తను కూడా చదవండి: GHMC: ఆహా.. ఏం ఐడియా.. సొంత కార్లు.. అద్దె వాహనాలుగా..


చందానగర్‌ సర్కిల్‌ -21 పరిధిలోని మాదాపూర్‌, మియాపూర్‌, హఫీజ్‌పేట్‌, చందాననగర్‌(Madhapur, Miyapur, Hafizpet, Chandannagar) డివిజన్లలో 119మంది వ్యాపార పన్ను చెల్లింపుదారులు చెక్కులు ఇచ్చారు. వీరు సుమారు రూ:కోటి 5లక్షల వరకు పన్ను రావాల్సిఉండగా చెల్లించారు.


city7.jpg

మరికొందరి చెక్కులు బౌన్స్‌ కావడంతో వారి దుకాణాలకు తాళంవేసి సీజ్‌ చేస్తున్నారు. సంబంధిత వ్యాపార పన్ను చెల్లింపుదారులు సకాలంలో చెక్కులు చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని సూచించారు. లేకుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఉపకమిషనర్‌ మోహన్‌రెడ్డి తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 09:46 AM