ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NIT Student: పరీక్షలో తక్కువ మార్కులు..చివరకు ప్రాణమే తీసుకున్న యువకుడు

ABN, Publish Date - Apr 11 , 2025 | 07:20 AM

ప్రస్తుత కాలంలో మార్కుల ప్రాముఖ్యత పెరిగినందున, విద్యార్థుల మనసులో అనేక ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో విద్యార్థి ఇదే అశంపై తీవ్ర మనస్తాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

nit student Suicide

మార్కులనే ప్రామాణికంగా చూస్తున్న ప్రస్తుత రోజుల్లో..ఓ విద్యార్థికి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెందాడు. ఆ క్రమంలో అతని మనసులో అనేక ప్రశ్నలు, భయాలు మెదిలాయి. ఇంట్లో ఏమంటారు, ఫ్రెండ్స్ ఎలా చూస్తారనే ఆలోచనలు అతన్ని కుంగేలా చేశాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు అతను ఆత్మహత్యనే శరణ్యంగా భావించాడు. చివరికి, అతని తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చి, సమాజానికి ఒక దారుణమైన సందేశాన్ని అందించాడు. ఈ హృదయ విదారక ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది.


మార్కులు ముఖ్యమా..

ఇక వివరాల్లోకి వెళితే..రితిక్ సాయి అనే యువకుడు వరంగల్ NITలో రెండో సంవత్సరం BTech చదువుతున్నాడు. నిట్ అంటేనే పెద్ద కాలేజ్. విద్యార్థులు కూడా వారి జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించాలని చూస్తారు. అదే సమయంలో వారి తల్లిదండ్రులు కూడా వారిపై బోలేడు ఆశలు పెట్టుకుంటారు. ఆ క్రమంలోనే ఇటీవల పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని రిత్విక్ మనస్తాపం చెందాడు. అంతటితో ఆగలేదు. ఈ విషయం తన తల్లిదండ్రులు, స్నేహితులకు తెలిస్తే ఎలా అని ఆందోళన చెందిన విద్యార్థి..చివరకు హనుమకొండ వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం మనకు మార్కుల ప్రాముఖ్యత కంటే ఎక్కువగా విద్యార్థుల మనసు ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.


అసలు కారణం ఇదేనా..

ఈ విషయం తెలిసిన పలువురు మాత్రం మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది తప్పని చాలా మంది చెబుతున్నారు. కానీ నిజానికి సాయితో ఉన్న వారు మార్కులు తక్కువ వచ్చినా కూడా ఏం కాదని అతనితో మట్లాడి ఆందోళన లేకుండా చేస్తే, ఇంత దూరం వచ్చేది కాదని అంటున్నారు. విద్యార్థులు ఆందోళన లేదా ఒత్తిడిగా ఉన్న క్షణాల్లో వారికి ఉపశమనం కలిగించే విషయాలు చెప్పాలని నిపుణులు అంటున్నారు. దీంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మార్కుల పేరుతో వారిపై ఒత్తిడి తీసుకురావద్దని సూచిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మార్కులు రాకుంటే వెస్ట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 11 , 2025 | 07:28 AM