ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heart Attack: ఆట మధ్యలో ఆగిన యువకుడి గుండె!

ABN, Publish Date - Jul 29 , 2025 | 05:18 AM

రోజూ మాదిరిగానే స్నేహితులతో కలిసి షటిల్‌ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు ఆట మధ్యలోనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు.

  • షటిల్‌ ఆడుతూ కుప్పకూలి మృతి

  • హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఘటన

  • మృతుడి స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ

ఉప్పల్‌/తల్లాడ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రోజూ మాదిరిగానే స్నేహితులతో కలిసి షటిల్‌ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు ఆట మధ్యలోనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉపసర్పంచ్‌ జి.వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాకేశ్‌ (26) హైదరాబాద్‌లోని ఓ ఈవీ వాహన కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి ఉప్పల్‌ భగాయత్‌లోని ఎలైట్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి ఆదివారం రాత్రి వచ్చాడు. ఈ క్రమంలోనే రాత్రి 8 గంటల సమయంలో వారితో షటిల్‌ ఆడుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు.

వెంటనే సహచరులు అతడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే రాకేశ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనకు సంబంధించి అకాడమీ సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం రాకేశ్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు తల్లాడకు తీసుకెళ్లి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 05:18 AM