Hyderabad: చెన్నై గూడు.. గువ్వలకు తోడు
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:05 PM
పిచ్చుక గూళ్లను ఒకవైపు కొట్టేస్తుంటే.. అందుకు భిన్నంగా అల్వాల్‌కు చెందిన యోగా గురువు, ప్రకృతి ప్రేమికుడు నారాయణం గోపీనాథ్.. వాటి ఆవాసాల ఏర్పాటుకు కృత్రిమంగా తయారు చేసిన వందలాది గూళ్లను చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించి ప్రజలకు అందిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.
- కృత్రిమ పిచ్చుకల గూళ్లను తెప్పిస్తున్న యోగా గురువు, ప్రకృతి ప్రేమికుడు నారాయణం
హైదరాబాద్: పిచ్చుక గూళ్లను ఒకవైపు కొట్టేస్తుంటే.. అందుకు భిన్నంగా అల్వాల్‌కు చెందిన యోగా గురువు, ప్రకృతి ప్రేమికుడు నారాయణం గోపీనాథ్(Narayam Gopinath).. వాటి ఆవాసాల ఏర్పాటుకు కృత్రిమంగా తయారు చేసిన వందలాది గూళ్లను చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించి ప్రజలకు అందిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.
ఆహార అలవాట్లతో ప్రభావం
కాంక్రీట్ భవనాలు పిచ్చుకలకు గూళ్లు లేకుండా చేస్తే.. మారిన మన ఆహార అలవాట్లు వాటికి ఆహార భద్రత లేకుండా చేశాయి. గతంలో గింజ ధాన్యాలు ఎక్కువగా ఉపయోగించే ప్రజలు ఇప్పుడు వాటిని తగ్గించేయడమే ఇందుకు కారణం. మరోవైపు పంటపొలాల్లో ఉండే క్రిమికీటకాలను తినేవి దీంతో పంటలకు మేలు జరిగేది. ఇప్పుడు ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో వాటి ప్రభావం పిచ్చుకలపై పడుతోంది. కాలుష్యం పెరగడం.
వాతావరణంలో వస్తున్న మార్పులు పిచ్చుకల మనుగడపై ప్రభావం చూపాయి. గతంలో లక్షల్లో కనిపించే వాటి సంఖ్య ఇప్పుడు వేలకు పడిపోయింది.
ఆవాసాలు లేక అదృశ్యం
ఆధునిక ఒరవడిలో పట్టణాల నుంచి గ్రామాల వరకు శాశ్వత గృహాలు కాంక్రీట్ శ్లాబులతో నిర్మిస్తుండటంతో పిచ్చుక జాతి గూడుకు అనూకూలమైన గుడిసెలు, పెంకుటిళ్లు కనుమరుగవుతున్నాయి. దీంతో గూళ్లు పెట్టుకునే అవకాశం తగ్గిపోయింది. సంతానోత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. ఈ జాతిని బతికించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయడమేనని యోగా గురువు చెబుతున్నారు. సమస్యను ముందుగానే గుర్తించి మన ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటే అవి గూడును కట్టుకోగలుగుతాయి. దీని వల్ల పిచ్చుక జాతి వృద్ధి చెందే అవకాశాలు మెరుగవుతాయి.
దేశంలో అంతరించే జాతుల జాబితాలో పిచ్చుక చేరింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ వారు దాన్ని రెడ్ లిస్ట్‌లో చేర్చారంటే వాటి మనుగడ ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతి ఇంటిలో గూడు తప్పనిసరి
పిచ్చుకలు రేడియేషన్ ప్రభావం, అభివృద్ధి పేరుతో మనిషి చేసే అరాచకానికి భయపడి కంటికి కనపడకుండా పారిపోతున్నాయి. పిచ్చుకల సంరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇళ్ల వద్ద చెట్ల కొమ్మలపై కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేస్తే వాటి జాతిని తిరిగి పెంపొందించవచ్చు. కిచకిచల రావాలతో నగరమంతటా సందడి చేస్తాయి. నేను గూళ్లను చెన్నై నుంచి తెప్పిస్తున్నా. ఎవరికైనా కావాలంటే 9848409390 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.
- నారాయణం గోపీనాథ్, యోగా గురువు, ప్రకృతి ప్రేమికుడు, అల్వాల్
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్
Read Latest Telangana News and National News
Updated Date - Jun 30 , 2025 | 12:05 PM