ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదా ..

ABN, Publish Date - May 06 , 2025 | 06:09 AM

ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదని ఎవ రు రూల్‌ పెట్టారంటూ ఓ మహిళ ఏకంగా బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం సాయం త్రం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ శివారులో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Women Protest
  • ఎవరా రూల్‌ పెట్టారు..

  • కండక్టర్‌, డ్రైవర్‌తో మహిళ వాగ్వాదం

  • సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో

నల్లగొండ, మే 5 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లకూడదని ఎవ రు రూల్‌ పెట్టారంటూ ఓ మహిళ ఏకంగా బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఆదివారం సాయం త్రం నల్లగొండ జిల్లా నకిరేకల్‌ శివారులో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట నుంచి నల్లగొండ వెళ్తుండగా నకిరేకల్‌ వద్ద ఓ మహిళ రెండు సంచులతో బస్సు ఎక్కింది. ఆమె తీసుకువచ్చిన సంచుల్లో కల్లు బాటిల్‌ ఉండటంతో మహిళా కండక్టర్‌ అభ్యంతరం చెప్పింది.


ఇదే సమయంలో డ్రైవర్‌ కూడా జోక్యం చేసుకుని కల్లు బాటిళ్లతో బస్సు ఎక్కవద్దని అడ్డు చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ తనను ఎందుకు కల్లు తీసుకెళ్లనివ్వడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేసింది. బస్సుకు అడ్డంగా నిలబడి ముందుకు కదలనివ్వకుండా కొద్దిసేపు ఆందోళన చేసింది. అనంతరం ఆ మహిళ ఆటోలో గమ్యస్థానాన్ని బయలుదేరింది. ఈ విషయమై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో కల్లును తీసుకెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు.

Updated Date - May 06 , 2025 | 11:55 AM