Manda krishna Madiga: మోదీ వద్దకు కాకుండా ఎక్కడికెళ్లాలి..
ABN, Publish Date - Jan 22 , 2025 | 08:59 AM
‘‘ఎస్సీ వర్గీకరణ(SC classification) సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు కాకుండా మరెక్కడికి వెళ్లాలి? ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ(Narendra Modi)ని కాకుండా మరెవరిని కలవాలి. నేనేమీ బీజేపీ కండువా కప్పుకోలేదే!’’ అంటూ ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ(Manda krishna Madiga) వ్యాఖ్యానించారు.
- వర్గీకరణ సమస్యపై మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ సిటీ: ‘‘ఎస్సీ వర్గీకరణ(SC classification) సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వద్దకు కాకుండా మరెక్కడికి వెళ్లాలి? ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ(Narendra Modi)ని కాకుండా మరెవరిని కలవాలి. నేనేమీ బీజేపీ కండువా కప్పుకోలేదే!’’ అంటూ ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ(Manda krishna Madiga) వ్యాఖ్యానించారు. దళితులపై ఆధిపత్యకులాల అణచివేత సమస్యకు పరిష్కారం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడు ఆంగ్లేయుల వద్దకు వెళ్లాడు కదా.! సమస్య పరిష్కారానికి ఎవరి సహాయం అవసరమో, వారి వద్దకు వెళ్లడం తప్పు ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పీఎంఓలో పనిచేస్తున్నానంటూ మోసాలు..
తాను మోదీని కలవడంపై వస్తున్న విమర్శలకు సభాముఖంగా ఆయన బదులిచ్చారు. ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న సమయంలో అవమానాలు, ఆరోపణలు, నిందలు సహజం, అలాగే ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా పోరాడుతున్న తనమీద సాగుతోన్న దుష్ప్రచారాలకు భయపడి వెనక్కితగ్గేది లేదని తెగేసి చెప్పారు. అణగారిన వర్గాల బిడ్డగా తన కండువా ఎన్నడూ మార్చలేదు, ఇకమీదట మారేది కూడా లేదు అని నొక్కిచెప్పారు. మాజీ మంత్రి సంగంరెడ్డి సత్యనారాయణ (ముచ్చర్ల సత్తన్న) జయంతి సభ రవీంద్రభారతిలో మంగళవారం జరిగింది. మంద కృష్ణమాదిగ, విమలక్క, పాశం యాదగిరి, ఆచార్య మాడభూషి శ్రీధర్, ప్రొఫెసర్ వెంకటనారాయణ, తెలంగాణ విఠల్, ఏపూరి సోమన్న, గిద్దె రాంనర్సయ్య, వరంగల్ శ్రీను సత్తన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సంగంరెడ్డి సత్యనారాయణ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. సత్తన్న కలలుగన్న సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 90 శాతం జనాభాగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తెలంగాణ రాకముందు, తర్వాత కూడా తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఈ విషయంపై ‘మన త్యాగాలు మనకు మేలు చేసేనా’ అంటూ 2010లో ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాసినట్లు గుర్తుచేశారు. అట్టడుగు, బలహీన వర్గాల రాజ్యం వచ్చేవరకు ఉద్యమిస్తానని శపథం పూనారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తుంటే తన తల్లి గుర్తొస్తుందన్న సీఎం రేవంత్ మాటలను ప్రస్తావిస్తూ.. ఆయన తల్లి బడుగు, బలహీన వర్గీల తల్లి ఎలా అవుతుంది అని మంద కృష్ణ విమర్శించారు. చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, జానారెడ్డి కలిసి ఏకపక్షంగా కోదండరాంను పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా ప్రకటించినప్పుడే, తెలంగాణ ఏర్పాటు తర్వాత దొరలు, పటేళ్ల పాలన వస్తుందని తాను ముందే ఊహించి వ్యాసాలు రాసినట్లు చెప్పారు. రాజ్యాధికారమే లక్ష్యంగా దళిత, బహుజన, ఆదివాసీ, గిరిజన, మైనార్టీలంతా ఐక్యమవ్వాలని ఆకాంక్షించారు.
మరో తెలంగాణ పోరాటం అవసరం
ముచ్చర్ల సత్యనారాయణ ఆశించిన సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ సాధన దిశగా మరో తెలంగాణ పోరాటం అవసరమని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. సత్తన్నపై ప్రజాగాయని విమలక్క ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. సంగంరెడ్డి పృథ్వీరాజ్ సభాధ్యక్షత వహించగా, బోయినపల్లి హనుమంతరావు, గద్దర్ కుమారుడు సూర్యం, పాటమ్మతోనే రాంబాబు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే
ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
Read Latest Telangana News and National News
Updated Date - Jan 22 , 2025 | 09:00 AM