Share News

Hyderabad: పీఎంఓలో పనిచేస్తున్నానంటూ మోసాలు..

ABN , Publish Date - Jan 22 , 2025 | 08:39 AM

పీఎంఓలో పనిచేస్తానని, సీబీఐ, ఈడీ, ఏసీబీ(CBI, ED, ACB) కేసులను పరిష్కరిస్తానని, రాహుల్‌ గాంధీ పీఏనని, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి. శివకుమార్‌, ప్రముఖ నాయకుడు అహ్మద్‌ పటేల్‌తో దిగన ఫొటోలు చూపించి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని మొయినాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: పీఎంఓలో పనిచేస్తున్నానంటూ మోసాలు..

- మొయినాబాద్‌లో ఆరెకరాల భూమి ఆక్రమణకు యత్నం

- పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్‌

- బెంజ్‌ కారు, హాకీ స్టిక్‌లు, ఐరన్‌ రాడ్‌లు స్వాధీనం

హైదరాబాద్: పీఎంఓలో పనిచేస్తానని, సీబీఐ, ఈడీ, ఏసీబీ(CBI, ED, ACB) కేసులను పరిష్కరిస్తానని, రాహుల్‌ గాంధీ పీఏనని, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి. శివకుమార్‌, ప్రముఖ నాయకుడు అహ్మద్‌ పటేల్‌తో దిగన ఫొటోలు చూపించి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని మొయినాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌(Rajendranagar DCP Chintamaneni Srinivas) మంగళవారం విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గర్భిణిపై భర్త అమానుషం.. కడుపుపై కూర్చుని.. ముఖంపై దిండు అదిమిపెట్టి హత్య


మహ్మద్‌ అప్రోజ్‌ బేగ్‌(Mohammed Aproz Baig) మొయినాబాద్‌ తోలుకట్ట గ్రామంలోని సర్వే నంబర్‌ 144/పి లోగల ఆరెకరాల భూమిని వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి నుంచి జీపీఏ చేసుకున్నాడు. 2023, మే 9వ తేదీ రాత్రి హర్మోన్‌ రషీద్‌, సయ్యద్‌ నవాజుద్దీన్‌, బర్కతుల్లాకాన్‌, హసన్‌ యాతమ్‌, సయ్యద్‌ బురానుద్దీన్‌, సోహెల్‌, ఓమర్‌, యాతే మునవర్‌, మున్నా ఆరెకరాలను ఆక్రమించుకోవడానికి వెళ్లారు. అక్కడ నిద్రపోతున్న వారిపై హాకీ స్టిక్స్‌, బేస్‌ బాల్‌ బ్యాట్‌లు, ఐరన్‌ రాడ్స్‌, క్రికెట్‌ బేట్‌లతో దాడి చేశారు.


city5.2.jpg

వాహనాలను ధ్వంసం చేసి, కాంపౌండ్‌ వాల్‌ను కూల్చివేశారు. బాధితుడు మహ్మద్‌ అప్రోజ్‌ అదే ఏడాది మే 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులలో ప్రధాన సూత్రధారి సయ్యద్‌ బురానుద్దీన్‌ అలియాస్‌ బురాన్‌, అలియాస్‌ ఓపీ శర్మ అలియాస్‌ ఓపీ సింగ్‌(41) కోర్టు నుంచి నాట్‌ టు అరెస్ట్‌ ఆర్డర్‌ తీసుకొని తప్పించుకు తిరుగుతున్నాడు. నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకుని, బెంజ్‌ కారు, క్రికెట్‌ బ్యాట్‌, ఐరన్‌ రాడ్‌, హాకీ స్టిక్‌లను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.


బురానుద్దీన్‌పై 12 కేసులు

సయ్యద్‌ బురానుద్దీన్‌పై గతంలో 12 కేసులున్నాయని డీసీపీ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌(Jubilee Hills, Banjara Hills), మైలార్‌దేవుపల్లి, నార్సింగ్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మొయినాబాద్‌, ఫలక్‌నుమా, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కూడా అతడిపై కేసులున్నాయని డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ వివరించారు. ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారిపై సీబీఐ కేసు కొనసాగుతుండగా.. న్యాయం చేస్తానని ఆ అధికారి నుంచి బురానుద్దీన్‌ కోటిన్నర రూపాయలు తీసుకున్నాడని, ఈ కేసులో సీబీఐ అప్పట్లో అతడిని అరెస్ట్‌ చేసిందని తెలిపారు. నిందితుడిపై మొయినాబాద్‌ పీఎస్‌లో రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2025 | 08:39 AM