Home » Manda Krishna Madiga
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై దాడికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేశామని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతిని కలుస్తామన్నారు.
ధర్మం, విశ్వాసాల ముసుగులో దళితులపై దాడులు చేస్తున్న వారికి తగిన గుణపాఠం నేర్పుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడిని దేశంలోని 30 కోట్ల మంది దళితులపై దాడిగా భావిస్తున్నట్లు ఆయన అభివర్ణించారు.
ఆత్మగౌరవం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, దళిత జాతి ఆత్మగౌరవానికి ఆటంకం కలిగితే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
ఈ నెల 9న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబును చూసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి మందకృష్ణ మాదిగ ఎనలేని కృషి చేశారని, ఆయన అలుపెరుగని పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని పింఛన్‌దారులను సీఎం రేవంత్‌రెడ్డి మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.
సామాజిక న్యాయం పట్ల లోతైన అవగాహన ఉన్న మేధావి, రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగిన బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం దేశానికే గర్వకారణమని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కొనియాడారు.
తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలు, ఆసరా పెన్షన్ రూ.4 వేలు, తీవ్ర వైకల్యం గల వారికి రూ. 15 వేలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.