Mandakrishna Madiga: ఏ పోరాటానికైనా సిద్ధమే...
ABN , Publish Date - Oct 20 , 2025 | 07:39 AM
ఆత్మగౌరవం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, దళిత జాతి ఆత్మగౌరవానికి ఆటంకం కలిగితే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
- మందకృష్ణమాదిగ
హైదరాబాద్: ఆత్మగౌరవం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, దళిత జాతి ఆత్మగౌరవానికి ఆటంకం కలిగితే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) స్పష్టం చేశారు. ఉస్మానియా వర్సిటీలోని జి.రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్ మాదిగ అధ్యక్షత నిర్వహించిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయిపై జరిగిన దాడి కులాహంకారదాడి అని అన్నారు. ఈనెల 27న హైదరాబాద్‌లో జరగబోయే ‘‘దళితుల ఆత్మగౌరవ మహా ర్యాలీ’’కి వేలాదిగా తరలివచ్చి చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి
Read Latest Telangana News and National News