Manda Krishna Madiga: మీ గురువు చంద్రబాబును చూసి నేర్చుకోండి
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:36 AM
ఏపీ సీఎం చంద్రబాబును చూసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సూచించారు.
పింఛన్ల పెంపుపై రేవంత్, కేసీఆర్‌కు మంద కృష్ణ సూచన
వర్ధన్నపేట రూరల్/స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబును చూసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సూచించారు. గతంలో ఈ ఇద్దరూ చంద్రబాబు దగ్గర శిష్యరికం చేశారని, కానీ ఆయనలా ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా వారు పనిచేయడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు రూ.6వేలు.. వృద్ధులు, వితంతువులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.15 వేలు పింఛన్ ఇస్తున్నారని గుర్తుచేశారు. గురువారం వరంగల్ జిల్లా ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద జరిగిన వికలాంగులు, చేయూత పెన్షన్‌దారుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు.