Manda Krishna Madiga: ఎమ్మార్పీఎస్ చలో హైదరాబాద్ వాయిదా
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:39 AM
ఈ నెల 9న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు.
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఉన్నందునే : మంద కృష్ణ మాదిగ
పంజాగుట్ట, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఈ నెల 9న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. రాష్ట్రంలో వికలాంగులు, చేయూత పింఛన్ దారులకు ఇచ్చే పింఛన్ వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం తలపెట్టామన్నారు. సెప్టెంబరు నెలం తా ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్థం కావాలని నిర్ణయించామని తెలిపారు.
అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. అక్టోబరు 7 నుంచి 11వ తేదీ మధ్య లక్షలాది మంది వికలాంగులు, చేయూత పెన్షన్ దారులతో చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు.