Khammam: లబ్ధిదారుల ఇళ్ల వద్దకే కల్యాణలక్ష్మి చెక్కులు: తుమ్మల
ABN, Publish Date - May 04 , 2025 | 03:40 AM
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులు ఇకపై ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవరంలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఖమ్మం, మే 3 (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులు ఇకపై ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవరంలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆయా పథకాల చెక్కులు అందిస్తారని తెలిపారు.
ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన రూ.కోటి 63 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, రూ.9.30 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళితే ఆయా ప్రాంతాల్లోని సమస్యలు తెలుస్తాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2025 | 03:40 AM