ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jurala Reservoir: జూరాలకు నిలకడగా వరద

ABN, Publish Date - Jun 23 , 2025 | 04:59 AM

ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్‌కు నిలకడగా వరద కొనసాగుతున్నదని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. జలాశయంలో 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

  • 53 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • శ్రీశైలంలో 92 టీఎంసీల నీటి నిల్వ

  • ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీగా వరద

ధరూరు/ దోమలపెంట, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్‌కు నిలకడగా వరద కొనసాగుతున్నదని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. జలాశయంలో 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆదివారం 53 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదైంది. దిగువకు 50,467 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రెండు జల విద్యుత్‌ కేంద్రాల్లోని 11 యూనిట్లలో 90.033 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నది. భీమా లిఫ్ట్‌-1,2, కోయిల్‌ సాగర్‌ లిఫ్ట్‌ కెనాల్‌, ఎడమ కాలువ, కుడి కాలువ, ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌, సమాంతర కాల్వకు కలిపి 4,135 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక మొత్తం జూరాల నుంచి 49,363 క్యూసెక్కులతోపాటు శ్రీశైలం జలాశయానికి 58,962 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 855.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 92.4860 టీఎంసీలని శ్రీశైలం అధికారులు తెలిపారు. మరోవైపు, ఎగువన ఆల్మట్టి జలాశయంలో 70.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 70,440 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 68 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ జలాశయంలో 29.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 70,737 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదు కాగా, దిగువకు 81,615 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

రైతులకు ఉపశమనమిచ్చిన వర్షం

ఖమ్మం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదు కావడంతో రైతులకు ఉపశమనం లభించింది. దీంతో ఈ నెలలో జిల్లాలో సగటున 1.42 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత నెలాఖరులో కురిసిన తొలకరితో కొన్ని చోట్ల విత్తనాలు వేసిన రైతులు.. తర్వాత వర్షం కురవక విత్తనాలు మొలకెత్తక అన్నదాతలు నానా తంటాలు పడ్డారు. వానాకాలం సీజన్‌లో 6.07 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం కాగా, 77 వేల ఎకరాల్లో రైతులు విత్తనాలు వేశారు. శనివారానికి ముందు ఈ నెలలో 2 రోజులు మాత్రమే వర్షం కురిసింది. తల్లాడ, పెనుబల్లి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగతా 19 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2025 | 04:59 AM