Hyderabad: గీత, రాత పూర్తిగా తెలిసిన వ్యక్తి కార్టూనిస్ట్ శేఖర్
ABN, Publish Date - Jul 14 , 2025 | 04:26 AM
గీత, రాత పూర్తిగా తెలిసిన వ్యక్తి కార్టూనిస్ట్ శేఖర్ అని, నేటితరం కార్టూనిస్టులు సమకాలీన అంశాలతో పాటు సాహిత్యం మీద కూడా పట్టు సాధించాలని, అప్పుడే తాము చెప్పదలచుకున్న అంశాన్ని ప్రభావంతంగా..
సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్
కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు ప్రదానోత్సవ సభ
పంజాగుట్ట, జూలై 13 (ఆంధ్రజ్యోతి): గీత, రాత పూర్తిగా తెలిసిన వ్యక్తి కార్టూనిస్ట్ శేఖర్ అని, నేటితరం కార్టూనిస్టులు సమకాలీన అంశాలతో పాటు సాహిత్యం మీద కూడా పట్టు సాధించాలని, అప్పుడే తాము చెప్పదలచుకున్న అంశాన్ని ప్రభావంతంగా చెప్పగలుగుతారని సీనియర్ జర్నలిస్ట్ ఎస్.వినయ్ కుమార్ అన్నారు. కార్టూనిస్ట్ శేఖర్ జయంతి సందర్భంగా ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ’కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు-2025’ ప్రదానోత్సవ సభ జరిగింది. ప్రముఖ కార్టూనిస్ట్ మృత్యుంజయతో పాటు చిత్రకారుడు చిత్ర ఈఅవార్డులు అందుకున్నారు. వినయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శేఖర్ కార్టూన్ల ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. ’ఎ బ్రష్ అగైనెస్ట్ ప్రెజుడస్’, ‘ది ప్రొ-పీపుల్ ఆర్ట్ ఆఫ్ శేఖర్’ అనే అంశంపై సీనియర్ జర్నలిస్టు కేవీ కూర్మనాథ్ స్మారకోపన్యాసం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే శేఖర్ ‘గిదీ తెలంగాణ’, ‘క్యాస్ట్ క్యాన్సర్’ అనే పుస్తకాలు తీసుకువచ్చి అగ్రకులాల మీద తన యుద్ధాన్ని ప్రకటించాడని గుర్తు చేశారు. అవార్డు గ్రహీత మృత్యుంజయ మాట్లాడుతూ కార్టూనిస్ట్ శేఖర్‌ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు. మరో అవార్డు గ్రహీత చిత్ర మాట్లాడుతూ శేఖర్ బతికుండగా ఆయనకు ఒక బొమ్మ గీసి ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గుర్తుగా ఓ అవార్డు తీసుకోవడం జీవితంలో మరచిపోలేని విషయమన్నారు. ప్రభుత్వం తరఫున శేఖర్ పేరుతో ఒక అవార్డు ప్రకటించాలని, మ్యూజియం ఏర్పాటు చేయాలని వక్తలు కోరారు.
బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకుడు దాసు సురేశ్
గద్వాల, జూలై 13(ఆంధ్రజ్యోతి): బీసీలు సంఘటితంగా ఉంటేనే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయవచ్చని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపకుడు దాసు సురేశ్ చెప్పారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై సీఎం రేవంత్ ప్రధానమంత్రిని అడగటం లేదని సురేశ్ చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు బీసీ రాజ్యాధికార సమితి కృషి చేస్తుందని, బీసీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. త్వరలో జిల్లాలో మహాసభను నిర్వహించి బీసీల ఐక్యతకు కృషి చేస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 14 , 2025 | 04:26 AM