ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Sports Hub: ఉపాసనకు కీలక బాధ్యతలు.. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్‌గా నియామకం..

ABN, Publish Date - Aug 04 , 2025 | 01:55 PM

Telangana Sports Hub: స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్‌గా నియమించటంపై ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.

Telangana Sports Hub

తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ ‘స్పోర్ట్స్ పాలసీ 2025’ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని కో చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్‌గా నియమించటంపై ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ నియామకం తనకు ఎంతో గౌరవాన్నిచ్చిందని ఆమె అన్నారు. సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావటం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రన్ వేపై ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. 3 గంటలు అవుతున్నా..

జనం చూస్తుండగానే సముద్రంలో కుప్పకూలిన మినీ విమానం

Updated Date - Aug 04 , 2025 | 02:03 PM